INCOME TAX

 INCOME TAX ACT  click here

INCOME TAX ACT [AS AMENDED BY FINANCE ACT, 2024 AND FINANCE (NO. 2) ACT, 2024] click here 

INCOME TAX Caliculation for FY2024-25  rivesed on 28.01.2025  download here 


FY 2024-25 లో వర్తించే వివిధ విభాగాల క్రింద మొత్తం

ఆదాయంపై మినహాయింపు

​​​మొత్తం ఆదాయ పన్నుపై మినహాయింపు:

      స్టాండర్డ్ డిడక్షన్ 

    పాత పన్ను విధానం లో స్టాండర్డ్ డిడక్షన్ లో ఎలాంటి మార్పు లేదు 50,000/- అలాగే ఉంచారు

    కొత్త పన్ను విధానం లో మాత్రం  స్టాండర్డ్ డిడక్షన్ ను  50,000/- ల నుండి 75,000/- లకు పెంచారు

     ఫ్యామిలీ పెన్షనర్ లకు ఈ పరిమితిని 15000/- లనుండి 25000/- లకు పెంచారు

    కొత్త టాక్స్ విధానం లో  హోం లోన్ తీసుకొని అట్టి ఇంటిని కిరాయికి ఇచ్చినట్లయితే  వచ్చిన కిరాయి మొత్తాన్ని ఆద్యం లో చూపించి హోం లోన్ పై చెల్లించిన వడ్డీని మినహాయింపు పొందవచ్చు.

    NPS లో  ప్రభుత్వం జమ చేసిన నిధికి సెక్షన్ 80CCD(2) కింద మినహాయింపు వర్తిస్తుంది.

  • ​​​సెక్షన్ 87A
    ఒక పన్ను చెల్లింపుదారు ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉంటే, ఆ వ్యక్తి పాత పన్ను వ్యవస్థ ప్రకారం రూ. 12,500 వరకు పన్ను రాయితీకి అర్హత పొందుతారు. 

  • కొత్త పన్ను వ్యవస్థ కింద, రూ. 7 లక్షల వరకు ఆదాయం కోసం రూ. 25,000 వరకు రాయితీ అందుబాటులో ఉంది.

  • ​​​సెక్షన్ 80C​​
    పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యుఎల్ఐపి) మరియు ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఇఎల్ఎస్ఎస్) లో చేసిన పెట్టుబడుల కోసం పన్ను చెల్లింపుదారు రూ. 1.5 లక్షల వరకు రాయితీకి అర్హత కలిగి ఉంటారు.

  • ​​​సెక్షన్ 80సిసిడి(1B)​​
    పన్ను చెల్లింపుదారు జాతీయ పెన్షన్ పథకంలో వారి పెట్టుబడి కోసం మొత్తంగా రూ. 2 లక్షలు ఉండే విధంగా రూ. 50,000 వరకు అదనపు పన్ను మినహాయింపు పొందవచ్చు.

  • ​​​విభాగం 80D​​
    ఒక పన్ను చెల్లింపుదారు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం బిల్లులకు రూ. 25,000 వరకు పన్ను మినహాయింపుకు అర్హత కలిగి ఉంటారు. సీనియర్ సిటిజన్స్ కోసం, గరిష్ట పరిమితి రూ.50,000. ఈ సెక్షన్ కింద ఒకరు పొందగల గరిష్ట మినహాయింపు రూ. 1 లక్షలు.


  • ​​​సెక్షన్ 80g​G
    చారిటీలకు చేయబడిన విరాళాలు ఈ విభాగం కింద పూర్తిగా పన్ను మినహాయింపుగా ఉంటాయి.

  • ​​​సెక్షన్ 80E
    8 సంవత్సరాల వరకు ఎడ్యుకేషన్ లోన్ల కోసం చెల్లించిన వడ్డీపై 100% పన్ను రాయితీ వర్తిస్తుంది.

  • ​​​సెక్షన్ 80TTA/80TTB​​
    సేవింగ్స్ అకౌంట్ల నుండి రూ. 10,000 వరకు వడ్డీ ఆదాయం, పన్ను మినహాయింపులకు అర్హత కలిగి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ సెక్షన్ 80TTB క్రింద రూ.50,000 వరకు పన్ను మినహాయింపులను పొందడానికి అర్హత కలిగి ఉంటారు.

  • ​​​సెక్షన్ 80GG
    ఇంటి అద్దె చెల్లించడానికి ఖర్చు చేసిన ఆదాయం పన్ను మినహాయింపుకు అర్హత కలిగి ఉంటుంది. మీరు మీ యజమాని నుండి హెచ్‌ఆర్‌ఎ ప్రయోజనాలను అందుకోకపోతే ఈ విభాగం వర్తిస్తుంది..

  • సెక్షన్ 80U

  • కనీసం 40% వైకల్యంతో సూచించబడిన వైకల్యం ఉన్న వ్యక్తి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80U కింద మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు మినహాయింపు మొత్తం రూ. 75,000. 80% వైకల్యం ఉన్నట్లయితే, మినహాయింపు రూ. 1,25,000.

  • సెక్షన్ 80C కింద హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్‌పై పన్ను మినహాయింపు
      ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం, ఆదాయపుహోమ్ లోన్ ప్రిన్సిపల్ తిరిగి చెల్లించిన మొత్తంపై 1.5 లక్షలు. రూ. వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు.

  • హోంలోన్ వడ్డీ సెక్షన్ లు

     

            సెక్షన్ 24(B) : ఇంటిని లోన్ తో నిర్మించి స్వంతంగా నివసిస్తున్న వారికి వడ్డీ లో 2 లక్షల వరకు మినహాయింపు వర్తిస్తుంది. ఒక వేళ బార్య భర్తలు జాయింట్ గా లోన్ తీసుకొని ఉంటే వడ్డీ మినహాయింపు ఇద్దరికీ సమానంగా ఒక్కొక్కరికి గరిష్టంగా 2 లక్షలు వరకు వర్తిస్తుంది.

లోన్ తీసుకున్న ఇంటిని కిరాయికి ఇచ్చినట్లయితే  వచ్చే కిరాయి మొత్తాన్ని ఆదాయం లో చూపించి వడ్డీ మొత్తాన్ని మినహాయింపు పొందవచ్చు 


సెక్షన్ 80EE : 01.04.2016 నుండి 31.03.2017 మధ్య  మొదటి సారిగా  ఇంటిని లోన్ ద్వారా కొన్నప్పుడు దాని విలువ 50 లక్షలు గా ఉండీ 35 లక్షల లోపు లోన్ తీసుకుని ఉంటే సెక్షన్ 24(B) కి అదనంగా 50000/- వరకు మినహాయింపు వర్తిస్తుంది.


సెక్షన్ 80EEA :  01.04.2019 నుండి 31.03.2022 మధ్య మొదటి సరిగా ఇంటిని లోన్ ద్వారా కొన్నప్పుడు దాని స్టాంపు డ్యూటీ విలువ 45 లక్షల లోపు ఉంటే వడ్డీ మినహాయింపు సెక్షన్ 24(B) కి అదనంగా 1,50000/- వర్తిస్తుంది.

ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద అనేక రకాల ఆదాయాలు మినహాయించబడతాయి. వీటిని పన్ను-రహిత ఆదాయ వనరులుగా పిలుస్తారు. వీటిలో కొన్ని మీరు తెలుసుకోవాలి:

  • వ్యవసాయ ఆదాయం

  • స్వచ్ఛంద పదవీవిరమణ లేదా వెళ్లిపోయే సమయంలో చెల్లింపులు

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నుండి ఫండ్స్

  • ప్రభుత్వ ఉద్యోగి అందుకున్న ఏదైనా గ్రాట్యుటీ మొత్తం

  • పెన్షన్ తగ్గింపు కోసం ఏదైనా చెల్లింపు (కమ్యూటేషన్ మొత్తం )

  • హిందూ అవిభాజ్య కుటుంబం నుండి పొందిన మొత్తం 

  • భాగస్వామ్య సంస్థ లేదా ఎల్‌ఎల్‌పి నుండి వచ్చిన షేర్స్

  • ఎన్ఆర్ఐలు సంపాదించిన కొన్ని వనరులు లేదా మొత్తం 

  • భారతదేశంలో విదేశీ వ్యక్తులు సంపాదించిన ఆదాయం మరియు మొత్తం 

60  సంవత్సరాల లోపు  వయస్సు గల వ్యక్తుల కోసం ఆదాయపు పన్ను స్లాబ్ (FY 2024-25)

నికర వార్షిక పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం

కొత్త పన్ను వ్యవస్థ (మినహాయింపులు మరియు తగ్గింపులను మినహాయించి)

పాత పన్ను వ్యవస్థ (మినహాయింపులు మరియు తగ్గింపులతో సహా)

రూ. 2.5 లక్ష వరకు

మినహాయింపు

మినహాయింపు

రూ.2.5 లక్షల నుండి రూ.3 లక్షల వరకు

మినహాయింపు

5%

రూ.3 లక్షల నుండి రూ.5 లక్షల వరకు

5%

5%

రూ.5 లక్షల నుండి రూ.7 లక్షల వరకు

5%

20%

రూ.7 లక్షల నుండి రూ.10 లక్షల వరకు

10%

20%

రూ.10 లక్షల నుండి రూ.12 లక్షల వరకు

15%

30%

రూ.12 లక్షల నుండి రూ.15 లక్షల వరకు

20%

30%

రూ. 15 లక్షలు

30%

30%




Tax rebate up to Rs.20,000 is applicable if the total income does not exceed Rs 7,00,000 in NEW regime.              

Tax rebate up to Rs.12,500 is applicable if the total income does not exceed Rs 5,00,000 in     OLD regime.



60 మరియు 80 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తుల కోసం ఆదాయపు పన్ను స్లాబ్ (FY 2024-25)


పన్ను స్లాబ్‌లు

పాత వ్యవస్థ కింద రేట్లు (60 సంవత్సరాలు)

పాత వ్యవస్థ కింద రేట్లు (80 సంవత్సరాలు)

కొత్త వ్యవస్థ కింద రేట్లు

రూ. 3 లక్ష వరకు

ఏవీ ఉండవు

ఏవీ ఉండవు

ఏవీ ఉండవు

రూ.3 లక్షలు – రూ.5 లక్షలు

5%

ఏవీ ఉండవు

5%

రూ.5 లక్షలు – రూ.7 లక్షలు

20%

20%

5%

రూ.7 లక్షలు – రూ.10 లక్షలు

20%

20%

10%

రూ.10 లక్షలు – రూ.12 లక్షలు

30%

30%

15%

రూ.12 లక్షలు – రూ.15 లక్షలు

30%

30%

20%

రూ. 15 లక్షలు

30%

30%

30%





Tax rebate up to Rs.20,000 is applicable if the total income does not exceed Rs 7,00,000 in NEW regime

Tax rebate up to Rs.12,500 is applicable if the total income does not exceed Rs 5,00,000 in     OLD regime.



No comments: