Employees Attendence Register Rules

అటెండెన్స్ రిజిస్టర్ లో  కేడర్ వారీగా సెనియర్టీ ప్రకారం ఉద్యోగుల పేర్లు నమోదు చేయాలి.
ముందుగా GHM, తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ ఆ తర్వాత SGT చివరికి జూనియర్ అసిస్టెంట్స్, రికార్డ్ అసిస్టెంట్స్ మరియు ఆఫీస్ సబ్ ఆర్డినేట్ యొక్క పేర్లు నమోదు చేయాలి
స్కూల్ అసిస్టెంట్స్ లలో వారి పేర్లు సీనియారిటీ ప్రకారం అదే విధంగా SGT ల పేర్లు వారి సీనియారిటీ ప్రకారం నమోదు చేయాలి.

Writing of names of the teachers in the Attendance Register as per seniority.

Proceedings Of The Director Of School Education A.P. Hyderabad, L.Dis.No. 1709/C3-1/2005, Dt. 01.12.2005




1.లోకల్ హాలిడేస్ (3)
డే & డేట్ తో సహా రిజిస్టర్ ముందు పేజీ లో రాసి ఉంచాలి
2.ఇచ్చిక సెలవులు (5) డే & డేట్ తో సహా రిజిస్టర్ ముందు పేజీ లో రాసి ఉంచాలి 
అధికారుల అనుమతి తో వాటిని స్కూల్ మొత్తానికి ఉపయోగించుకోవాలి 
వ్యక్తిగతంగా ఈ లీవ్ లు ఉపయోగించరాదు

3.లీవ్ లెటర్ లు ముందుగా సబ్మిట్ చేసి ముందస్తు అనుమతి తో లీవ్ పెట్టుకోవాలి
ఈ లీవ్ లెటర్ లు సపరేట్ పైల్ లో భద్రపరచాలి CL రిజిస్టర్ లో ప్రతి లీవ్ ఎంట్రీ చేయాలి
అటెండెన్స్ రిజిస్టర్ లో CL ను మార్క్ చేయాలి

4.బ్లూ/బ్లాక్ పెన్ తో మాత్రమే రిజిస్టర్ లో సంతకం చేయాలి రెడ్/గ్రీన్ పెన్ లతో సంతకం చేయరాదు. జెల్ పెన్/ ఇంక్ పెన్ లతో సంతకం చేయరాదు.
5.OD వివరాలు తప్పనిసరిగా రిజిస్టర్ లో రాయాలి దానికి సంబంధించిన డాక్యుమెంట్ లను భద్రపరచాలి
6.ఉన్నతాధికారులు సందర్శించినప్పుడు అటెండెన్స్ రిజిస్టర్ లో తప్పనిసరిగా సంతకం చేయాలి హెడ్మాస్టర్ సంతకం కింద సంతకం చేస్తారు

7.లీవ్ /OD వివరాలు రిజిస్టర్ లో రెడ్ పెన్ తో  సూచించాలి
8.సెలవులను (పబ్లిక్ హాలిడేస్) రిజిస్టర్ లో ముందస్తుగా రాయరాదు 
9.అటెండెన్స్ రిజిస్టర్ లో కొట్టివేతలు, వైటనర్ లను ఉపయోగించరాదు ఒకవేళ కరెక్షన్ అవసరం అయితే తప్పు ఎంట్రీ పై ఒక సింగిల్ లైన్ తో క్రాస్ చేసి సరైన వివరాలు ఎంట్రీ చేయాలి ఆ ప్రదేశం లో  ప్రధానోపాధ్యాయులు సంతకం చేయాలి 

10.అటెండెన్స్ రిజిస్టర్ లోని ప్రతి పేజీ పైన స్కూల్ స్టాంప్ (రౌండ్ స్టాంప్ కాదు) వేయాలి

11.ఒకవేళ అటెండెన్స్ రిజిస్టర్ లోని ఏదైనా పేజీ చిరిగితే దానిపై ట్రాన్స్పరెంట్ టేప్ తో మాత్రమే అతికించాలి డేటా క్లియర్ గా కనబడేలా అతికించాలి.
12.అటెండెన్స్ రిజిస్టర్ లో ముందస్తు సంతకాలు చేయరాదు 
అలాంటి వాటికి ఉన్నతాధికారులు తీసుకొనే చర్యలకు బాధ్యత వహించవలసి ఉంటుంది 
13.కాంటాక్ట్ / అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సపరేట్ గా అటెండెన్స్ రిజిస్టర్ నిర్వహించాలి అందులో 
హెడ్మాస్టర్ రోజుకు రెండు సార్లు విధిగా సంతకం చేయాలి 
14.మే నెలలో కూడా అటెండెన్స్ రిజిస్టర్ లో టీచర్స్ వివరాలు నమోదు చేసి సమ్మర్ వేకేషన్ అని రాయాలి

15.ఒక సంవత్సరం మొత్తానికి ఒకే అటెండెన్స్ రిజిస్టర్ వాడాలి రెండు రిజిస్టర్ లు ఉపయోగించరాదు 
అందుకు తగిన విధంగా రిజిస్టర్ లో పేజీలు ఉండే విధంగా చూసుకోవాలి 
16.అటెండెన్స్ రిజిస్టర్ లో ఎలాంటి గ్యాప్ వదిలేయరాదు 
17.ప్రతి టీచర్ ప్రతి రోజు రెండు సార్లు విధిగా సంతకం చేయాలి 

18.రిజిస్టర్ స్కూల్ లోనే ఉంచాలి ఎవరూ కూడా ఇంటికి /ఇతర ప్రదేశాలు కు తీసుకొని వెళ్ళరాదు

19.ఉన్నతాధికారుల  పర్యవేక్షణకు అందుబాటులో ఉంచాలి

20.అటెండెన్స్ రిజిస్టర్ శుభ్రంగా కొట్టివేత్తలు లేకుండా నిర్వహించాలి

No comments: