𝐏𝐨𝐧𝐠𝐚𝐥 𝐡𝐨𝐥𝐢𝐝𝐚𝐲𝐬 :𝟐𝟎𝟐𝟓
𝟏𝟑.𝟎𝟏.𝟐𝟎𝟐𝟓 𝐭𝐨 𝟏𝟕.𝟎𝟏.𝟐𝟎𝟐𝟓 (𝟓𝐝𝐚𝐲𝐬) 𝐨𝐧𝐥𝐲.
హాలిడేస్ కు ముందు..
11th- రెండవ శనివారం
12- ఆదివారం అవుతుంది..
కావున పాఠశాలకు సెలవులు.. 11 నుండి ప్రారంభం అవుతాయి.
హాలిడేస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి.. 10days దాటకుండా... హాలిడేస్ కు ముందు, వెనుక CLs కాంబినేషన్ చేసుకోవచ్చు..
రెండవ శనివారం కు ముందు or 17 th తరువాత కూడ CLs పెట్టుకోవచ్చు..అది ఉద్యోగి ఇష్టం..
10 days అనంతరం మాత్రం 11 వరోజు పాఠశాల విధులకు హాజరు కావాలి..
ఒక వేళ హాజరు కాకపోతే.. హాలిడేస్ తో పాటు.. మిగతా రోజులు అన్నీ కూడా.. OCL చేసుకోవాలి.
అసలు ప్రిఫిక్స్ అంటే,సఫిక్స్ అంటే వివరంగా తెలుసుకుందాం.
15 రోజులకు మించిన సెలవుల ను వెకేషన్ అంటారు.
వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ(రెండింటిలో ఒక్కటి మాత్రమే) హాజరు అయితే సరిపోతుంది.
C&DSE Rc.No.815/E1/1999 తేది:01-09-1999 ప్రకారం టర్మ్ హాలిడేస్ 14 రోజులకు మించిన సందర్భంలో ప్రిఫిక్స్,సఫిక్స్ (PREFIX SUFFIX) చేసుకునుటకు అవకాశం కలదు. అంటే
చివరి పనిదినం, రీ ఓపెనింగ్ డే లలో ఏదో ఒక రోజు హాజరు కానిచో ఆ రోజు అర్హతగల సెలవు పెట్టుకోవచ్చును ( CLమరియు CCL కాకుండా).
9రోజుల కంటే ఎక్కువ,15 రోజుల కన్నా తక్కువ ఉన్న సెలవు లను షార్ట్ టర్మ్ హాలిడేస్ అంటారు
షార్ట్ టర్మ్ హాలిడేస్ కు ముందు, తర్వాత రోజు తప్పక హాజరు కావాలి.
దసరా సెలవులు 9 రోజుల కన్నా ఎక్కువ 15 రోజులు కన్నా తక్కువ ఇచ్చిన సందర్భంలో సెలవులకి ముందు రోజు,సెలవుల తరువాత రోజు తప్పకుండా బడికి హాజరు కావాలి.
హాజరు కాకపోతే సెలవులలో కలిపి మొత్తానికి eligible leave పెట్టుకోవాలి (HPL/ML/EL/EOL)
షార్ట్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల కన్నా తక్కువ ఐన ముందు రోజు గానీ,తర్వాత రోజు గానీ సాధారణ సెలవు పెట్టుకోవచ్చు.కానీ, మొత్తం కలిపి 10రోజులు దాటవద్దు
No comments:
Post a Comment