(1) ఒక ఉద్యోగి తన ఉద్యోగ నిర్వహణకు సంబంధం లేని ఇతరత్రా నేరాలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భాలలో కూడా సస్పెండు చేయవచ్చు (G.O.Ms. No. 27 G.A.D., dt. 24-01-2002).
(2) కస్టడీ - 48 గంటలకు మించి :- క్రిమినలు ఆరోపణల ఆధారంగా గాని లేక ఇతరత్రా కారణాలవల్లగాని ఒక ఉద్యోగిని 48 గంటలకు మించి కస్టడి (Custody) లో వుంచినప్పుడు, కస్టడీకి తీసుకున్న తేదీ నుంచి సస్పెండు చేయవచ్చు (Deemed Suspension (Rule 8 of A.P.C.S. (CC & A) Rules 1991).
(3) ఎ.సి.బి.:- అవినీతి నిరోధక శాఖవారి నుంచి.
ఎ) ఉద్యోగి అవినీతి గురించి సమాచారము అందిన వెంటనే, ఉద్యోగిని సస్పెండు చేయవలసియున్నది (Govt. Memo No. 2487/S.C./E/98-1 GAD, dated 19-11-1998 and Govt.U.O. Note No. 1818/Spl. B/2000-2 GAD dated 21-11-2001).
బి) ఎసిబి :- ఎ.సి.బి. వారు నమోదు చేసిన కేసులు, శాఖాపరంగా విచారణ చేసి, సంబంధిత నివేదిక (Report) తదుపరి చర్యల గురించి, ఎసిబి వారికి తెలియజేయవలసియున్నది. కాని అట్టి శాఖాపర ఉత్తర్వులపై ఎసిబివారు ఎట్టి సమీక్ష (Review) చేయకూడదు. అంతేగాకుండా మరల తిరగతోడకూడదు. (G.O.RT No. 977 G.A. (Spl. B) department, dated 26-2-2003).
సి) ఎసిబి-రేడియో మెసేజ్:- ఎసిబివారి నుంచి రేడియో మెసేజ్ అందిన వెంటనే ఉద్యోగిని సస్పెండ్ చేయాలి. (Govt. Memo No. 3676/Ser.C/2004 G.A. (Ser.C) department, dated 12-03-2004).
(4) అకారణ సస్పెన్షన్లు - అధికారులపై చర్య: ఉద్యోగులను అకారణంగా, న్యాయ సమ్మతముగాని (unjustified) సస్పెన్షనుకు గురి చేసినట్లు నిరూపితమైన యెడల, అట్టి చర్యలకు పాల్పడిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనవలెనని, అంతేకాకుండా అకారణ సస్పెన్షనుకు గురియైన ఉద్యోగికి చెల్లించిన జీవనభృతి, సంబంధిత అధికారి నుండి తిరిగి రాబట్టవలసి వుంది. (Govt. Memo No. 2213/Ser.C. 66-1 GAD dt.30-11-1966 and Govt. Memo No. 4993/Police-C/69-1 Home Dept, dt. 8-12-1969).
(5) సస్పెన్షన్లు ఎప్పటినుంచి అమలులోకి వస్తాయి. (Govt. Memo 1085/Ser.C/72-3 GAD, dated 10-05-1973).
ఎ) వేరే డివిజనులోగాని, విధుల నిర్వహణలో టూరులో ఉన్న సందర్భాలలో, సస్పెన్షను ఉత్తర్వులు ముట్టిన తేదీ నుంచి అమలులోకి వస్తాయి.
బి) స్టోర్సు, గిడ్డంగులు, బ్యాండ్సు, సెక్యూరిటీ డిపాజిట్లు తదితర వాటి ఇన్ఛార్జిగా ఉన్న సందర్భాలలో చార్జ్ అప్పగించిన తేదీ నుండి సస్పెన్షను ఉత్తర్వులు అమలులోకి వస్తాయి.
(6) సస్పెన్షను వెనుకటి తేదీ నుంచి చేయకూడదు:- (para 4 Govt. Memo. No. 1085/Ser.C./72-3 GAD, dt. 10-5-1973) ఎ. పి. సి. యస్.(సి. సి. ఎ) రూల్సు 1991 రూలు 8 (2) తప్ప (Deemed suspension), ఇతర సందర్భాలలో వెనుకటి తేదీ నుంచి సస్పెండు చేయకూడదు.
(7) ధన దుర్వినియోగము - సస్పెన్షన్:- (G.O.Ms.No. 25 G.A. (Ser.C) dept., dt. 3-2-2004) ధన దూర్వినియోగముకు పాల్పడిన ఉద్యోగిని సస్పెండ్ చేయవలసి వుంది. వెయ్యి రూపాయలకు మించి దుర్వినియోగం చేసిన, పోలీసులకు రిపోర్టు చేయాలి. అంతకు తక్కువైన శాఖాపర చర్యలు తీసుకోవాలి.
(8) సస్పెన్షన్ - ఖాళీ పోస్ట్ భర్తీ చేయకూడదు:- (G.O.Ms.No. 189 GA (Ser.C) dept., dt. 20-4-1999 and Circular Memo. No. 20225/219 FR II/99 (F & P FR II) department, dated 23-07-1999).
(9) సస్పెండు అయిన వ్యక్తికి సెలవు మంజూరు చేయకూడదు:- సస్పెండు అయిన ఉద్యోగికి, సస్పెన్షను కాలంలో ఎలాంటి సెలవులు మంజూరు చేయకూడదు. (FR 55).
(10) సస్పెన్షన్ - పదోన్నతి:- (G.O.Ms.No. 257 GAD dt. 10-6-1999) తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ, సస్పెన్షనులో వున్న ఉద్యోగికి పదోన్నతి (Promotion) కల్పించకూడదు. తీవ్రతరం కాని ఆరోపణలుగా పరిగణించిన యెడల, కొన్ని సందర్భాలలో అట్టి వ్యక్తికి పదోన్నతి (Promotion) కల్పించవచ్చు.
(11) సస్పెన్షనులో వుంటూ చనిపోయిన ఉద్యోగి తదుపరి చర్యలు:- సస్పెండు అయిన ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు అసంపూర్తిగా ఉన్న సమయంలో, సస్పెన్షనులో వున్న ఉద్యోగి చనిపోయిన యెడల, సస్పెన్షను కాలాన్ని డ్యూటీ క్రింద పరిగణించవలెనని ప్రభుత్వం GO.Ms.No.275 Finance & Planning department, dated 08-08-1977 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
(12) సస్పెన్షను - రాజీనామా:- సస్పెన్షనులో వున్న ఉద్యోగి రాజీనామా చేసిన యెడల అంగీకరించకూడదు. (Rule 30 A.P. State and Subordinate Service Rules 1996).
(13) సస్పెండు అయిన ఉద్యోగి మధ్యంతర భృతి (Interim Relief) చెల్లించరాదు:- సస్పెండు అయిన ఉద్యోగికి మధ్యంతర భృతి (Interim Relief) చెల్లించరాదని ప్రభుత్వం Govt., Memo No. 44113/541/PCI/1/98-I F & P department, dated 11-11-1998 ద్వారా తెలియజెసింది.
(15) సస్పెన్షను - తిరిగి పదవిలో పునరుద్దరించుట (Revocation and reinstatement into service): - ఎ. పి. సి. యస్.(సి .సి.ఎ.) రూల్స్ 1991 లోని రూలు 8(1)(5)(సి) ప్రకారము ఏ అధికారి అయితే ఉద్యోగిని సస్పెండ్ చేశారో లేక ఆ పై అధికారిగాని, సస్పెన్షన్ ఉత్తర్వులును మార్పు చేయటం (Modify) గాని లేక కొట్టివేయటంగాని (Revoke) చేయు అధికారం కలదు.
ఎ) అదే విధంగా క్రమశిక్షణా చర్యలు (Disciplinary proceedings) తదుపరి చర్యలకు లోబడి కూడా సస్పెన్షను ఉత్తర్వులు రద్దు (Revoke) చేయవచ్చు.
బి). ఎ.సి.బి. కేసులవల్ల సస్పెన్షనులో వున్న ఉద్యోగిని పదవిలో పునరుద్ధరించే ముందుగా అవినీతి నిరోధక శాఖ డైరెక్టరుగారిని, సంప్రదించవలసి వుంటుంది. (Govt., Memo No. 1524/Ser.C/80-4 GAD dt. 20-5-1982)
(16) సస్పెన్షను - రెండు సంవత్సరముల పరిమితి:- రెండు సంవత్సరములకంటే ఎక్కువకాలం సస్పెన్షనులో ఉన్న ఉద్యోగిని, క్రమశిక్షణా చర్యలు పెండింగులో పెడుతూ వెంటనే సర్వీసులోకి పునరుద్ధరించవలెను. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో మాత్రమే సస్పెన్షన్ కొనసాగించవచ్చు. (GO Ms. No. 526 GA (Ser. C) Department dt. 19-08-2008).
(17) సస్పెన్షన్ - జీవనాధార భత్యం (Subsistance allowance):-సస్పెన్షనుకు గురియైన ఉద్యోగికి జీవనాధారభత్యం (Subsistance allowance) ఏ పద్ధతిపై చెల్లించవలెనను విషయము FR 53 యందు వివరించారు.
ఎ) మొదటి మూడు నెలలకు, ఉద్యోగి అర్ధ జీతం సెలవులో (Half pay leave) వెళ్ళియుంటే పొందునటువంటి సెలవు జీతమునకు సమానముగా వచ్చు మొత్తం [FR 53(1)(ii)(a)] అంటే వాడుక భాషలో 50% అటు తర్వాత ఉద్యోగి అభ్యర్థనపై కొన్ని షరతులకు లోబడి 75% వరకు చెల్లించవచ్చు.
బి). జీవనాధార భత్యం లెక్కించు విధానము:-
1. మూల వేతనం (Basic pay) లో సగం.
2. దామాషా పద్ధతిపై (proportionate) కరువు భత్యం (D.A)
3. సస్పెండు కాకముందు పొందుతున్న మూల వేతనంపై పూర్తి ఇంటి అద్దె (HRA) మరియు కంపెన్సేటరి అలవెన్సులు పరిమితి కాలానికి అనుగుణంగా పూర్తిగా చెల్లించవచ్చు. [FR 53 (i)(ii)(b)] and Circular Memo 40986/489/A2/FR II F & P, dated 01-04-2000).
(18) జీవనాధార భత్యం నుంచి మినహాయింపులు (Deductions) క్రింద పొందుపరిచిన బకాయిలు జీవనాధార భత్యం నుంచి రాబట్టవచ్చు. (Ruling I under FR 53).
ఎ) ఆదాయు పన్ను మరియు వృత్తి పన్ను,
బి) ఇంటి బాడుగ తత్సంబంధిత ఇతర ఛార్జెస్.
సి) శాఖాధిపతి నిర్ణయించిన మేరకు, ఉద్యోగి తీసుకున్న అప్పులు, అడ్వాన్సులు.
డి) అధిక మొత్తాలు ఏమైనా చెల్లించియున్న యెడల, జీవనాధార భత్యములో మూడవ భాగం మించకుండా రాబట్టవచ్చు.
ఇ) జి.పి.యఫ్., తాత్కాలిక అడ్వాన్సులు రికవరీ చేయకూడదు. (Rule 15 of GPF Rules)
(19) జీవనాధార భత్యము - రివ్యూలు :- ఉద్యోగి సస్పెన్షనులో వున్న కాలాన్నంతటికి, రివ్యూలతో సంబంధం లేకుండా జీవనాధారభత్యం చెల్లించాలి. (Govt., Circular Memo No. 2970 Fin. & Plg. dept., dt. 15-09-1994).
No comments:
Post a Comment