NEE DHARMAM

 

నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు

సత్యం కోసం సతినే అమ్మినదెవరుహరిశ్చంద్రుడు
తండ్రి మాటకై కానలకేగినదెవరుశ్రీ రామచంద్రుడు
అన్న సెవకే అంకితమైనదెవరన్నలక్ష్మన్న
పతియె దైవమని తరించిపొయినదెవరమ్మాసీతమ్మ
పుణ్య మూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం
అనుసరించుటే నీ ధర్మం

నీ ధర్మం మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు

చాప కూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న
మేడి పండులా మెరిసె సంఘం గుట్టువిప్పెను వేమన్న
వితంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించె కందుకూరి
తెలుగు భారతిని ఫ్రజలభాషలొ తీరిచిదిద్దెను గురజాడ
సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం

స్వతంత్రభారత రథసారధియై సమరాన దూకె నెతాజీ
సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చె బాపుజీ
గుండుకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి
తెలుగువారికొక రాష్త్రం కోరి ఆహుతి ఆయెను అమరజీవి
దేశ భక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం
నీవు పుట్టిన దేశం

No comments: