JAYA JAYA JAYA PRIYA BHARATHA

JAYA JAYA JAYA PRIYA BHARATHA
   
  download 

 

జయ జయ జయ ప్రియ భారత


జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి

జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి  || 2 ||

జయ జయ సశ్యమల సుశ్యామ చలచ్చేలాంచల

జయ వసంత కుసుమ లతా చలిత లలిత చూర్ణకుంతల

జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళా! || 2||    || జయ జయ ||

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ

జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ

జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా!  || 2||    || జయ జయ ||

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి


No comments: